హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శెట్టివారిపల్లిలో మహిళ అనుమానాస్పద మృతి

KDP: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లిలో నారపురెడ్డి బాలసుబ్బమ్మ (65) అనుమానాస్పదంగా మృతి చెందారు. పొలం వద్దకు వెళ్లిన ఆమెపై చెరువు కట్ట కింద అరటి తోట సమీపంలో గుర్తుతెలియని జంతువు దాడి చేసినట్లు సమాచారం. ముఖంపై తీవ్ర గాయాలై అధిక రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. వివరాలు తెలియాల్సి ఉంది.