హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివలింగం పానమట్టం మార్పుపై భక్తుల ఆగ్రహం

MNCL: బెల్లంపల్లి మండలంలోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని రాతి శివలింగం పానమట్టం మార్పు ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. స్వయంభుగా వెలసి భక్తుల పూజలు అందుకుంటున్న రాతి శివలింగం చుట్టూ ఉన్న పానమట్టాన్ని చిన్నదిగా మార్చిన ఘటనతో భక్తులు ఆశ్చర్యపోతున్నారు. గర్భగుడిలో నిత్య జలధార అభిషేకించే శివలింగం పానమట్టాన్ని కోతకు గురి చేయడమేమిటని మండిపడ్డారు.