SKLM: పలాస మండలం కంబిరిగాం సమీప జాతీయ రహదారిపై ఇవాళ వేకువజామున లారీ ఢీకొని 30 గొర్రెలు మృతి చెందాయి. మూడు గ్రామాలకు చెందిన ఆరుగురు కాపరులు గొర్రెల మందను రోడ్డు దాటిస్తుండగా ప్రమాదం జరిగింది. ఓ గొర్రెల కాపరికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొన్ని గొర్రెల పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
లారీ ఢీకొని.. 50 గొర్రెల మృతి


