NGKL: కల్వకుర్తి పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక వివరాల ప్రకారం.. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో రూపేష్ (22) అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి


