హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా క్రీడల్లో కుంకుమ్ సంచలనం

ఆసియా క్రీడల రికర్వ్ ఆర్చరీ మహిళల సింగిల్స్‌లో 17 ఏళ్ల భారత యంగ్ ఆర్చర్ కుంకుమ్ పసిడి పతకం సాధించి చరిత్ర సృష్టించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో కొరియన్ ఆర్చర్‌పై 6-5 పాయింట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. కాగా, ఈ టోర్నీలో ఇప్పటికే టీమ్‌ గోల్డ్, మిక్స్‌డ్ సిల్వర్ సాధించిన కుంకుమ్, వ్యక్తిగత విభాగంలోనూ గోల్డ్ నెగ్గి అదరగొట్టింది.