ప్రకాశం: మైనంపాడు గ్రామ సచివాలయానికి చెందిన టి.పద్మ జిల్లా స్థాయిలో బెస్ట్ స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్ అవార్డును అందుకున్నారు. ఒంగోలులోని NTR కళా పరిషత్‌లో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డు ప్రదానోత్సవంలో MLA దామచర్ల జనార్దన్‌రావు, జిల్లా కలెక్టర్ రాజాబాబు చేతుల మీదుగా ఆమె పురస్కారం అందుకున్నారు. కార్యక్రమంలో మంత్రి స్వామి, పంచాయతీ అభివృద్ధి అధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మైనంపాడు ఉద్యోగికి స్వచ్ఛత పురస్కారం


