NTR: చందర్లపాడు గ్రామంలోని SC కాలనీలో గత వారం రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వాటర్ ట్యాంక్ మోటారు మరమ్మతులకు గురికావడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో కాలనీవాసులు, పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు దూరం నుండి నీటిని తెచ్చుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే స్పందించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చందర్లపాడులో తాగునీటి కష్టాలు


