HNK: పరకాల పట్టణంలో వృద్ధురాలి హత్య కేసులో పోలీసులు ఓ అనుమానితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఆకులవాడకు చెందిన కోడెల సుగుణ (63) ఆగంతకుల దాడిలో మృతి చెందగా, ఆమె తల్లి లస్ముక్క తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా అనుమానితుడిని గుర్తించిన పోలీసులు జిల్లా కేంద్రానికి తరలించి విచారిస్తున్నట్లు తెలిసింది.
తెలంగాణ
హత్య కేసులో అనుమానితుడు అరెస్ట్?


