హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తహసీల్దార్ ఆఫీస్ రోడ్డులోనే నెల రోజులుగా నీరు వృథా!

AKP: రోలుగుంట ఎస్సీ కాలనీ వద్ద తహసీల్దార్ కార్యాలయ రోడ్డులోని వాటర్ ట్యాంక్ పైప్‌లైన్ పగిలింది. కార్యాలయం ఎదురుగా ఉన్న కుళాయి నుంచీ సుమారు నెల రోజులుగా తాగునీరు రోడ్డుపైనే వృథాగా పోతోంది. దీంతో రోడ్డు బురదమయమై రాకపోకలకు ఇబ్బందిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే పైపులైన్ మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.