హైదరాబాద్: 28°C
తెలంగాణ

18 దేశాలకు ములుకనూర్ సహకార పాఠాలు

HNK: భీమదేవరపల్లి మండలం ములుకనూర్ సహకార సంఘం గ్రామీణ ఆర్థికాభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తోందని 18 దేశాల ప్రతినిధులు ప్రశంసించారు. ఐటీఈసీ కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న అధికారులు, పోలీసు అధికారులు, జర్నలిస్టులు శుక్రవారం సంఘాన్ని సందర్శించారు. సంఘం అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి సంస్థ ప్రస్థానం, రైతులకు అందిస్తున్న సేవలను వివరించారు.