హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అల్లూరి జిల్లాలో ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. మరోవైపు, ఈనెల 12న ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని తెలిపింది. దీని ప్రభావంతో 13 నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.