హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NTR: విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా భవానీపురం సబ్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ ఆర్. రవికిషోర్ ఓ ప్రకటనలో తెలిపారు. సైన్స్ సెంటర్, బబ్బూరి గ్రౌండ్స్, భవానీద్వీపం, అల్లుడుపేట, నాగార్జున వీధీ, మసీదు వీధి, రంగూన్ సాహెబ్ వీధి, మీరా సాహెబ్ వీధి, చైతన్య అపార్ట్‌మెంట్ వరకు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సరఫరా ఉండదని పేర్కొన్నారు.