హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన యువతకు ఉచిత పోలీసు కొలువు శిక్షణ!

ADB: ఉమ్మడి జిల్లా గిరిజన యువతీ యువకులకు పోలీసు ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీవో మంద మకరందు శుక్రవారం తెలిపారు. 60 రోజులు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. రూ. 3 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు అక్టోబరు 5 లోగా ఉట్నూర్ లోని ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.