హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ స్తంభంపై తీగలు.. ప్రమాద భయం

PDPL: మంథని మండలం వెంకటాపూర్ గ్రామంలోని నేతకాని కాలనీలో విద్యుత్ స్తంభాన్ని తీగజాతి మొక్క అల్లుకుంది. దీంతో విద్యుత్ తీగలకు ఇబ్బంది ఏర్పడి ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ స్తంభాన్ని అల్లుకున్న తీగజాతి మొక్కను తొలగించి ప్రమాదాన్ని నివారించాలని కోరుతున్నారు.