హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుడ్లవల్లేరులో ఉచిత వైద్య శిబిరం

కృష్ణా: గుడ్లవల్లేరు జన్మభూమి వైద్యశాలలో ఈ వారాంతంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వైద్యులు సీఎల్. వెంకట్రావ్ తెలిపారు. శని, ఆదివారాల్లో జరిగే శిబిరంలో సాధారణ అనారోగ్య సమస్యలతో పాటు జీర్ణకోశం, గుండె, దంత, మధుమేహం, మానసిక ఆరోగ్య సమస్యలకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అవసరమైన వారికి చికిత్స, వైద్య సలహాలు అందిస్తామని తెలిపారు.