హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిథిలావస్థకు చేరిన సహకార సంఘ భవనాలు

KNR: వీణవంక మండలం చల్లూరు, పోతిరెడ్డిపల్లి సహకార సంఘ భవనాలు శిథిలావస్థకు చేరాయి. సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాల్లో రెండు దశాబ్దాలుగా ఎరువుల బస్తాలు నిల్వ చేసి రైతులకు సరఫరా చేశారు. ప్రస్తుతం భవనాలు కూలే దశకు చేరడంతో ఎరువులను అద్దె ఇళ్లలో నిల్వ చేస్తున్నారు. కొత్త గోదాములు నిర్మించాలని రైతులు కోరుతున్నారు.