హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఖైదీలు పరివర్తన చెంది గౌరవప్రద జీవితం సాగించాలి'

ఏలూరు జిల్లా కారాగారంలో ఖైదీల సంక్షేమ దినోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మొదటి అదనపు జిల్లా జడ్జి ఇందిరాప్రియదర్శిని, కలెక్టర్ వెట్రిసెల్వి పాల్గొన్నారు. ఖైదీలు పరివర్తన చెంది సమాజంలో గౌరవప్రదమైన జీవితం సాగించాలని జడ్జి సూచించారు.  ఖైదీల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.