హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి సెక్షన్ పరిధిలోని సుంకర వారి తోట 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో ఆర్ఎఎస్ఎస్ పనుల్లో సందర్భంగా శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గం. వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఈఈ రాజశేఖర్ తెలిపారు. మాదేపల్లి, గురకలపేట, లింగరావుగూడెం, చింతమనేని కాలనీ, పల్లం కాట్లంపూడి, శ్రీపర్రు, కలకుర్రు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.