హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతలమయంగా ప్రధాన వీధులు!

తిరుపతి జిల్లా తడ పట్టణంలో బజారు వీధి, రైల్వే గేటు నుంచి మసీదు వెళ్లే రహదారులు అధ్వానంగా మారాయి. పలు చోట్ల రోడ్లపై గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో గుంతలు కారణంగా వాహనదారులకు రాకపోకలు కష్టంగా మారాయి. వర్షాలు కురిసిన సమయంలో గుంతల్లో నీరు చేరడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు.