కృష్ణా: పెడన మండలంలోని నందిగామలో పీహెచ్సీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 8.30 గంటలకు వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యుడు ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఈ శిబిరాన్ని ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉచిత వైద్య శిబిరం


