W.G: ఇరగవరం మండలం అయినపర్రుకి చెందిన పదో తరగతి విద్యార్థి మోహన్ రెడ్డి (15) కాలువలో పడి గల్లంతయ్యాడు. కాకిలేరు సమీపంలోని నరసాపురం కాలువలో కాళ్లు కడుక్కుంటుండగా ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. తిరుమల పాఠశాలలో చదువుతున్న ఈ బాలుడి ఆచూకీ కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థి ఆచూకీ ఇంకా లభించలేదు.
ఆంధ్రప్రదేశ్
బాలుడి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు


