హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరెంట్ షాక్‌తో అయ్యప్ప భక్తుడు మృతి

WG: ఆకివీడు మండలం చినమిల్లిపాడు గ్రామంలో కరెంట్ షాక్ తగిలి వెంకట్రావు (48) అక్కడికక్కడే మృతి చెందాడు. తెలంగాణలో నివసిస్తున్న ఇతను గ్రామంలో ఇల్లు నిర్మించుకునేందుకు వచ్చి, ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో ఈ ఘటన జరిగింది. ఇటీవల అయ్యప్ప మాల ధరించిన వెంకట్రావు మృతితో కుటుంబంలో విషాదం అలముకుంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.