హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉపాధి శిక్షణపై అవగాహన సదస్సు

GNTR: దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ద్వారా గ్రామీణ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఉచితంగా ఉద్యోగ ఆధారిత నైపుణ్య శిక్షణ అందించనుంది. దీనిపై తుళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ కె.శిల్ప తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.