KRNL: ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించగలమని కలెక్టర్ డా. ఏ.సిరి అన్నారు. కర్నూలు కలెక్టరేట్లో అవార్డులు అందజేశారు. పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ జీవన విధానంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 5 స్వచ్ఛాంధ్ర అవార్డులు లభించగా జిల్లా స్థాయిలో వివిధ విభాగాలు, సంస్థలు, వ్యక్తులకు 64 SASA అవార్డులను ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛతకు ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్


