హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోక్సో కేసుల పట్ల అవగాహన పెంచుకోవాలి: ఎస్సై

W.G: పోక్సో కేసుల పట్ల అవగాహన పెంచుకోవాలని ఆకివీడు ఎస్సై శుభ శేఖర్ సూచించారు. శుక్రవారం సాయంత్రం ఆకివీడు మండలం చినమిల్లిపాడు గ్రామంలో డయల్ 112, సైబర్ నేరాలు, పోక్సో కేసుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. సమాజంలో జరుగుతున్న నేరాలు పట్ల ప్రతి ఒక్కరు జాగరూకతతో వ్యవహరించాలన్నారు. మరింత భద్రత కోసం పోలీసులను సంప్రదించాలన్నారు.