హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

GNTR: తాడేపల్లి మండలం ప్రాతూరు పరిధిలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డీఈఈ అనిల్ బాబు తెలిపారు. విద్యుత్ లైన్ల నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ అంతరాయం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. వినియోగదారులు సహకరించాలని, నిర్ణీత సమయం తర్వాత సరఫరా యథావిధిగా పునరుద్ధరిస్తామని ఆయన పేర్కొన్నారు.