హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫ్యాక్టరీపై నుంచి పడి కార్మికుడి మృతి

W.G: కాళ్ల మండలం జక్కరంలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో శుక్రవారం ప్రమాదం జరిగింది. గోడౌన్‌పై సోలార్ ప్యానెల్స్ బిగిస్తుండగా ప్రమాదవశాత్తు సిమెంట్ రేకు విరిగి కిందపడటంతో కార్మికుడు మృతి చెందాడు. మృతుడిని జువ్వలపాలేనికి చెందిన గాతల అజయ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు భీమవరంలోని ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.