CTR: రాయితీ ధరపై ఉల్లిపాయల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈమేరకు చిత్తూరులోని రైతు బజారులో శనివారం ఉదయం 8గంటలకు రాయితీ ఉల్లిపాయల పంపిణీని అధికారులు ప్రారంభిస్తారు. ఈ ప్రత్యేక విక్రయాల ద్వారా కేజీ రూ.35లకు ఒక్కో కుటుంబానికి 2 కిలోల చొప్పున ఉల్లిపాయలను అందించనున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆధార్, రేషన్ కార్డు తీసుకురావాలని అధికారులు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి రాయితీ ధరతో ఉల్లిపాయలు


