ASR: గూడెం కొత్తవీధి, చింతపల్లి మండలాల్లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఈఈ వేణుగోపాల్ తెలిపారు. ఇవాళ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. నిర్వహణ పనుల కారణంగా అంతరాయం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ఆయా ప్రాంతాల విద్యుత్ వినియోగదారులు గమనించి, సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


