PPM: పాలకొండ మండలం ఎన్.కే.రాజ్‌పురం,వడమ, నీలమ్మకాలనీ,యాలం,ఇందిరానగర్ కాలనీ ప్రాంతాలకు ఇవాళ తాగునీటి సరఫరా ఉండదని కమిషనర్ నూకరాజు తెలిపారు. స్థానిక అంపిలి వద్ద మోటార్‌లో సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఎన్.కే.రాజ్‌పురం, వడమ ట్యాంకులకు నీటి పంపింగ్ నిలిచిపోయిందన్నారు. ఈ మేరకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నేడు తాగునీటి సరఫరాకు అంతరాయం'


