హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప డీఎస్పీగా రామకృష్ణుడు

కడప డీఎస్పీగా రామకృష్ణుడిని నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 1995 బ్యాచ్‌కు చెందిన ఆయన జిల్లాలో ఎస్సై, సీఐగా పలు ప్రాంతాల్లో పనిచేశారు. 2008లో సీఐగా పదోన్నతి పొందారు. డీఎస్పీగా పదోన్నతి అనంతరం నెల్లూరు ఏసీబీ డీఎస్పీగా పనిచేస్తున్న ఆయనను కడప డీఎస్పీగా బదిలీ చేశారు.