హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాముకాటుతో వృద్ధుడి మృతి

SKLM: వజ్రపుకొత్తూరు మండలం శివరాంపురానికి చెందిన ఆర్.ఎస్.బోడయ్య (74) పాముకాటుతో మృతి చెందారు. ఈనెల 1న పొలంలో పశువులను మేతకు తీసుకెళ్లగా పాము కాటేసింది. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి మరణించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.