హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘ఆటో డ్రైవర్లకు త్రిశూల్‌పై అవగాహన’

ASR: కొయ్యూరు ఎస్సై పీ.కిషోర్ వర్మ ఆధ్వర్యంలో ఇవాళ కాకరపాడు ఆటో స్టాండ్‌లో ఆపరేషన్ త్రిశూల్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు, మహిళలపై నేరాలు, గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని టోల్‌ఫ్రీ నంబర్‌లకు తెలియజేయాలని ఆటో డ్రైవర్లకు సూచించారు. త్రిశూల్ టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1930, సమాచారం అందించే విధానంపై వారికి వివరించారు.