హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరకు పైనరీకి సీఎం చేతుల మీదుగా అవార్డు

అల్లూరి జిల్లాలోని అరకు పైనరీకి రాష్ట్ర స్థాయి స్వచ్ఛ పర్యాటక అవార్డు లభించింది. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర పర్యాటక అభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ గుర్తింపు దక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జిల్లా అటవీ అధికారి ఉమామహేశ్వరి, జిల్లా పర్యాటక అధికారి చలపతిరావు అవార్డును అందుకున్నారు. కలెక్టర్ నిశాంతి వారిని అభినందించారు.