హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ రిసార్టులపై పోలీసుల మెరుపు తనిఖీలు..!

విశాఖ నగరంలోని రిసార్టులపై సిటీ పోలీసులు విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. CP ఆదేశాలతో 33 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. మొత్తం 110 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. నగరంలోని 69 రిసార్టులను తనిఖీ చేసిన అనంతరము లైసెన్సులు, అనుమతులు, సిబ్బంది ధ్రువపత్రాలు, రికార్డులు, ధరల పట్టికలు పరిశీలించారు.