హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ

కోనసీమ: నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు ఐటీసీ, ప్రథమ్ సంస్థల ట్రైనర్ జగదీశ్ శుక్రవారం తెలిపారు. రాయవరంలో 72వ బ్యాచ్ ప్రారంభం సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేసి యువతకు అవగాహన కల్పించారు. ఐటీసీ, ప్రథమ్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వెల్డింగ్, ఎలక్ట్రికల్, హోటల్ మేనేజ్మెంట్ రంగాల్లో మూడు నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.