హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు

ELR: ఆకివీడు మండలానికి చెందిన వైసీపీ ముఖ్య నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం జనసేన పార్టీలో చేరారు. భీమవరంలోని నిర్మల ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పీవీఎల్ నరసింహారాజు ఆధ్వర్యంలో వారు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.