హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కళాశాల భవనానికి శంకుస్థాపన..!

కడప: ఓల్డ్ రిమ్స్ ప్రాంగణంలో రూ. 416.95 లక్షలతో నిర్మించనున్న ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజ్ నూతన భవనానికి ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ జోనల్ కో- ఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. నేషనల్ ఆయుష్ మిషన్ కింద చేపట్టనున్న భవన నిర్మాణం, అప్‌గ్రేడేషన్ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని నేతలు ఆవిష్కరించారు.