BHPL: మల్హర్ మండలంలోని కొయ్యూరు సెక్షన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. 33/11 కేవీ వల్లంకుంట సబ్‌స్టేషన్ నుంచి తాడిచెర్ల సబ్‌స్టేషన్ వరకు 33 కేవీ విద్యుత్ లైన్‌లో మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


