NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్టు ఎంపీడీవో దస్తగిరి బాబు వెల్లడించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు రూ. 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో పేర్కొన్నారు.
వార్తలు
నేడు కొలిమిగుండ్లలో మంత్రి బీసీ పర్యటన


