హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛతలో విశాఖను ప్రపంచ స్థాయిలో నిలపాలి: ఎంపీ

విశాఖను ప్రపంచస్థాయి పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఎంపీ శ్రీభరత్, కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ పిలుపునిచ్చారు.శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరీనాలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో వారు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో 68 మంది, సంస్థలకు పురస్కారాలు అందజేశారు.