హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెల్మెట్ ధరించిన వారికి ఎస్పీ అభినందన

BPT: రేపల్లె బందోబస్తు ముగించుకుని వస్తుండగా చెరుకుపల్లి మండలం కనగాల వద్ద బైక్‌పై ఇద్దరూ హెల్మెట్ ధరించి వెళ్తుండడాన్ని బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ గమనించారు. వాహనాన్ని నిలిపి వారిని స్వయంగా అభినందించారు. 'శిరోరక్ష ప్రాణరక్ష' కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని, ప్రాణాపాయం తప్పించుకోవాలన్నారు.