హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ

కోనసీమ: అయినవిల్లి మండలం మాగాం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శుక్రవారం పరామర్శించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, అనంతరం శివాజీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దళితుల హక్కుల రిజర్వేషన్ల కోసం కలిసి పోరాడుతామన్నారు.