హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హాకీ క్రీడాకారులకు సామగ్రి పంపిణీ

ATP: నార్పల మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు వడ్డీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో హాకీ క్రీడాకారులకు రూ.15 వేల విలువైన హాకీ సామగ్రి, టీషర్ట్లు అందజేశారు. క్రీడాకారులు కష్టపడి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నార్పల పేరు నిలబెట్టాలని ప్రభాకర్‌రెడ్డి సూచించారు. దేశానికి ప్రాధాన్యం ఇస్తూ క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.