హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమరావతి ORRకు కీలక ముందడుగు

GNTR: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి NHAI కీలక ముందడుగు వేసింది. మూడు ప్యాకేజీలకు రూ.8,668 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. 189.93 కి.మీ. ప్రధాన ORRతో పాటు నారాకోడూరు–బుడంపాడు 5.2 కి.మీ. స్పర్ రహదారి నిర్మించనున్నారు. ఈ అనుసంధానం తెనాలి–గుంటూరు–అమరావతి ప్రాంతాల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంది.