హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 6న ద్విచక్ర వాహనాల వేలంపాట

SKLM: సోంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న10 ద్విచక్ర వాహనాలను ఈనెల 6న వేలం వేయనున్నట్లు ఎస్ఐ బి.మోహిని శుక్రవారం తెలిపారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో పారదర్శకంగా వేలం నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్నవారు నిబంధనలు పాటిస్తూ హాజరు కావాలని సూచించారు. వాహనాల వివరాలు నేరుగా వచ్చి స్టేషన్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు.