సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓపెనర్ అభిషేక్ శర్మ వీడే అవకాశమున్నట్లు క్రీడావర్గాలు వెల్లడించాయి. గత సీజన్‌లో కెప్టెన్సీ విషయంలో మేనేజ్‌మెంట్ నిర్ణయంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జట్టు మారేందుకు ముంబై, గుజరాత్, పంజాబ్ ఫ్రాంచైజీలతో చర్చిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరిగే వేలంలో దీనిపై పూర్తి స్పష్టత రానుంది.
క్రీడలు
SRHను వీడనున్న అభిషేక్ శర్మ?


