బాపట్ల రెడ్ క్రాస్ భవన్‌లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నేడు ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్, డాక్టర్ భువనేశ్వరి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు హోమియోపతీ ద్వారా మంచి మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వినియోగించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో ఉచిత హోమియో వైద్య శిబిరం


