హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహనీయుల ఆశయాలకు కట్టుబడి పనిచేస్తాం'

NLR: టీడీపీ జిల్లా కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర వారి చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. గాంధీ సత్యం, శాంతి, అహింస మార్గాలు ఆదర్శనీయమని, శాస్త్రి నినాదం ‘జై జవాన్ జై కిసాన్’ చిరస్మరణీయమని కొనియాడారు. వారి ఆశయాలకు కట్టుబడి పనిచేస్తామన్నారు.