హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా స్థాయి స్వచ్ఛ అవార్డులు పంపిణీ

కృష్ణా: బాపులపాడు మండలం బొమ్ములూరులోని నెక్స్జెన్ ఫీడ్స్ ఫ్యాక్టరీకి జిల్లా స్థాయిలో స్వచ్ఛ అవార్డు లభించింది. స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగంగా ఫ్యాక్టరీలో చేపట్టిన చర్యలను గుర్తించి ఈ అవార్డును అందించారు. జిల్లా కలెక్టర్ బాలాజీ చేతుల మీదుగా నెక్స్జెన్ ఫీడ్స్ ఫ్యాక్టరీ ఎండీ అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం అవార్డును శుక్రవారం అందుకున్నారు.